24.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఎస్‌ఐఆర్ ఫారాల నమోదు ను తనిఖీ చేసిన ప్రో డిప్యూటీ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియను నిజామాబాద్ ప్రో డిప్యూటీ కలెక్టర్ సందీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న నమోదు ప్రక్రియ పురోగతిపై తహసీల్దార్ బాలయ్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో ఇందల్వాయి మండలం 82.45 శాతం నమోదు పూర్తి చేసి ముందంజలో ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలయ్యతో పాటు సంబంధిత అధికారులను ప్రో డిప్యూటీ కలెక్టర్ సందీప్ అభినందించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందల్వాయి మండలం టాప్‌లో నిలిచినందుకు గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, బీఎల్‌వోలు, జీపీవోలను కూడా ఆయన అభినందించారు. మండలంలో మొత్తం 31,076 ఎస్‌ఐఆర్ పారాలు ఉండగా, ఇప్పటివరకు 25,623 పారాల నమోదు పూర్తయిందని తెలిపారు. మిగిలిన పారాల నమోదును కూడా రెండు రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి సర్పంచ్ లోకాని గంగమణి గంగారాం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి భరత్, వార్డు సభ్యుడు సాయిలు, కారోబర్ పోచయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ జెగ్గ రాములు, బీఎల్‌వోలు, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.

 

Pro-Deputy Collector inspected the registration of SIR forms.

More articles

Latest article