ఎస్‌ఐఆర్ ఫారాల నమోదు ను తనిఖీ చేసిన ప్రో డిప్యూటీ కలెక్టర్

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియను నిజామాబాద్ ప్రో డిప్యూటీ కలెక్టర్ సందీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న నమోదు ప్రక్రియ పురోగతిపై తహసీల్దార్ బాలయ్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో ఇందల్వాయి మండలం 82.45 శాతం నమోదు పూర్తి చేసి ముందంజలో ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలయ్యతో పాటు సంబంధిత అధికారులను ప్రో డిప్యూటీ...