జాతీయ స్థాయిలో విద్యార్థులకు బహుమతులు 

బతుకమ్మ, ఏర్గట్ల: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ, రాష్ట్రస్థాయిలో సాహిత్య పరిషత్ సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులనుఏర్గట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి,ఉపాధ్యాయ బృందం అభినందించారు.తెలుగు సాహిత్య అకాడమీ,  తెలంగాణ ప్రభుత్వం వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో వ్యాసరచన మరియు కథ రచనలో మొదటి బహుమతి, తెలంగాణ సాహిత్య పరిషత్ వారు నిర్వహించిన జాతీయస్థాయి సాహిత్య పోటీలలో వచన కవిత, ఉపన్యాసం, ఏకపాత్రాభినయం, కథల పోటీలలో మొదటి బహుమతి పొందిన అభిలాష్, రాజేష్, రూపక్, నవదీప్, వైష్ణవి,రిశ్వంత్...