29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలో 124 బూత్ లో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  దేశంలో నివసిస్తున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు 24 శాతం ఉన్న నిత్యవసర వస్తువుల జీఎస్టీని  తగ్గించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి పాలాభిషేకం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బిచ్కుంద మండల అధ్యక్షులు శెట్పలి విష్ణు మాట్లాడుతూ దేశంలో నివసిస్తున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని, మధ్యతరగతి  కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని నిత్యం మనం ఇంట్లోకి వాడే నిత్యవసర వస్తువుల పైన భారం పడకుండా జిఎస్టి శాతాన్ని తగ్గించిన మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు, దేశ రక్షణే కాకుండా దేశంలో నివసిస్తున్న పేద ప్రజల కోసం కూడా రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా 16 గంటలు పనిచేస్తూ 365 రోజుల ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశ 140 కోట్ల ప్రజలే తన కుటుంబం గా భావిస్తూ నిత్యం ప్రజల కోసమే ఆలోచించే నిర్ణయం తీసుకున్నందుకు నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము బిచ్కుంద భారతీయ జనతా పార్టీ  తరుపున ఈ కార్యక్రమంలో భూత్ అధ్యక్షులు మోహన్ దేశయి, మండల జనరల్ సెక్రెటరీ జాదోవ్ పండరి, బిచ్కుంద మండల ఇన్చార్జ్ శివాజీ పటేల్, ఎలక్షన్ ఇన్చార్జ్ ధనుర్ విట్టల్, మండల ఉపాధ్యక్షులు ధర్మానాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ చారి, మిషన్ కల్లాలి బూత్ అధ్యక్షులు బాలు, బిజెపి సీనియర్ నాయకులు పసికే ప్రకాష్, బుడల గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article