25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నేత జన్మదినాన రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

  • డాక్టర్. మల్లికార్జున్ కు బీజేపీ శ్రేణుల బహుమానం
  • చౌట్ పల్లిలో ఘనంగా జన్మదిన వేడుకలు

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి జన్మదిన కార్యక్రమాన్ని కానిస్టెన్సీ బీ జె పీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నేత జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చౌట్ పల్లి గురడి సంఘంలో రక్తధాన మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ రక్తదానం చేశారు. ఆయనతో కానిస్టెన్సీలోని భీంమ్ గల్, కమ్మర్ పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ఎర్గట్ల, బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు 22 మంది రక్తధానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి నేత డాక్టర్. మల్లికార్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి చేశారు.ఈ బర్త్ డే వేడుకల్లో కానిస్టెన్సీ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Blood donation camp on the leader's birthday

More articles

Latest article