హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమం కింద సివిల్స్ లో ర్యాంకు సాధించిన వారికి సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెక్కులను పంపిణీ చేశారు. రూ.లక్ష చొప్పున 178 మందికి చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, రాజ్ ఠాకూర్ తదితర నేతలు పాల్గొన్నారు.
