26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గర్భిణీలు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: గర్భిణీలు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్ వైజర్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహారంపై గర్భిణీలకు అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో గల పోషకాల విలువల గురించి గర్భిణులకు వివరించారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, కెవికే శ్వేత, హెల్త్ సూపర్వైజర్ జ్యోతి, డిఎంసి స్వప్న, ఐసిడిఎస్ సూపర్ వైజర్ శ్రీలత, విజయ్ కుమార్, నరేష్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణీ బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article