బతుకమ్మ భిక్కనూరు: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సౌత్ క్యాంపస్ విద్యార్థి ప్రీతమ్ కుటుంబానికి యూనివర్సిటీ తరపున సేకరించిన విరాళాల చెక్కును రిజిస్ట్రార్ ప్రో.యాదగిరి గురువారం సౌత్ క్యాంపస్ లో విద్యార్థి మేనమామ కు చెక్కును అందించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్థి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. సౌత్ క్యాంపస్ విద్యార్థికి ఇలా జరగడం దురదృష్టకరం అన్నారు. ప్రీతమ్ కుటుంబానికి యూనివర్సిటీ అండగా ఉంటుందని తెలిపారు. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ చేతికి అందివస్తున్న కొడుకు మరణించడం తో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆవేదన చెందారు. అందుకే ఆ కుటుంబానికి తమవంతు సాయంగా సౌత్ క్యాంపస్ విద్యార్థులు,అధ్యాపకులు,పూర్వ విద్యార్థులు తోచిన విరాళాలు అందించారని,వాటన్నింటినీ కలిపి మొత్తం 1 లక్ష,13 వేల,300 రూపాయలు చెక్కు రూపంలో కుటుంబానికి అందినచామని అన్నారు. ఇంకా ప్రీతమ్ కుటుంబానికి వీలైన రీతిలో సాయంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్,సోషల్ సైన్సెస్ డీన్ ప్రో.ఘంటా చంద్రశేఖర్, హాస్టల్ వార్డెన్ లు డా.యాలద్రి, డా.సునీత అధ్యాపకులు డా.మోహన్ బాబు, డా.అంజయ్య, డా.హరిత, డా.ప్రతిజ్ఞ, డా.నాగరాజు, డా.నారాయణ, డా.రమాదేవి, డా.నర్సయ్య,డా.ఇంద్రకరణ్,పోతన్న,డా.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
