28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ

 

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ లు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కానిస్టెన్సీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో తడ్వాయి మండల కేంద్రంలో బీయర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న యూరియా యాప్ రద్దు ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా స్థానిక పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ముందస్తు అరెస్ట్ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా యాప్ వాళ్ళ రైతులు పడుతున్న ఇబ్బందిని తొలగించేందుకు శాంతి యుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తుంటే పోలీసులు హైదరాబాద్ లో అడ్డుకోవడం విడ్డురంగా ఉందన్నారు.

 

Prashanth Reddy under house arrest

 

ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసన చేస్తే కూడా ముందస్తు అరెస్ట్ లు చేయడం అన్యాయం అన్నారు. ప్రొటెస్ట్ ప్రోగ్రాం కు వెళ్తుంటే అరెస్ట్ ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. రైతులకు కోసం తాను వెళ్ళాల్సిందేనని ఆయన పోలీసులతో వాగ్వివాధానికి దిగారు. ఢిల్లీకి 72 సార్లు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెట్రో రైలు పైన సమావేశాలు పెట్టడానికి సమయం ఉంటుంది కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని యూరియా గురించి అడిగే శ్రద్ధ లేదన్నారు. రేవంత్ రెడ్డికి రైతులంటే చాలా చులకన భావం ఉందని విమర్శించారు. అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రావాల్సిన యూరియాను ఒకేసారి ఇవ్వకుండా కోతలు విధిస్తోందని, ఇటు రేవంత్ రెడ్డికి కేంద్రం నుండి తెచ్చుకునే తెలివి లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలుగా తాము రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే వినే ఓపిక లేకపోగా, రివర్స్‌లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అటు నరేంద్ర మోదీ, ఇటు రేవంత్ రెడ్డి.. ఈ రెండు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా విషయంలో, వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాయని ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చెయ్యాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Prashanth Reddy under house arrest

More articles

Latest article