27 C
Hyderabad

ప్రభుత్వానికి ముందు చూపు లేకనే విద్యుత్ కోతలు

Power cuts due to the government's lack of foresight

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

రైతులకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనత పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం విద్యుత్ ఎస్ఈకి సాల్య నాయక్ కి వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు, బీజేఎల్పీ ఉపనేత కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందు చూపు లేకనే రైతులు విద్యుత్ కోతలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎలెనినో వల్ల సమస్య ఉంటుందని 6 నెలల ముందే తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదనీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వాన్ని విమర్శించడం పై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదనీ అన్నారు. ఈ పంట కి నీళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలనీ , యాసంగి పంటకి క్యాబ్ ప్రణాళిక ఇప్పుడే తయారు చేయాలనీ డిమాండ్ చేశారు. లేకపోతే త్రాగు నీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనీ అన్నారు.

Power cuts due to the government's lack of foresight
 

More articles

Latest article