27 C
Hyderabad

బల్ధియాలో కొత్తగా ఐదు సర్కిళ్ళ ఏర్పాటు

Creation of five new circles in the municipal corporation

Must read

📰 Generate e-Paper Clip

. . . నలుగురు జవాన్లకు ఎస్సైలుగా ప్రమోషన్

. . . పది సర్కిళ్లకు ఎస్సైల నియామకం

. . . అంతర్గతంగా ఎస్సైల బదిలీలు

నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ద్య పనుల నిమిత్తం సర్కిళ్లను పెంచారు. ఇది వరకు 50 డివిజన్లకు 5 జోన్ లు ఉండగా దాని ప్రకారమే సర్కిళ్లను నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి విలీన గ్రామాలతో కలిసి పది డివిజన్లు పెరిగిన విషయం తెల్సిందే. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రస్తుతం 60 డివిజన్లు ఉండగా సర్కిళ్ళను పెంచుతూ అందులో భాగంగా కొందరికీ జవాన్లకు ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న ఎస్సైలను అంతర్గతంగానే బదిలీ చేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 16న ఆదేశాలు వెలువడ్డాయి.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇది వరకు 5 సర్కిళ్ళలో సానిటరి ఇన్స్ పెక్టర్ల ఆధ్వర్యంలో సాలిడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా పబ్లిక్ హెల్త్ విభాగంలో పారిశుద్ద్య పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎండి.షాదుల్లా హుస్సెన్ ఒక్కరే రెగ్యులర్ ఎస్సైగా పని చేస్తున్నారు. ప్రభుదాస్ ఎన్ఎంఆర్ గా పని చేస్తుండగా, మహిపాల్, ప్రశాంత్, శ్రీకాంత్, సునీల్ కుమార్, కృష్ణలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఎంపికై ఎస్సైలుగా చెలామణి అవుతున్నారు. తాజాగా మున్సిపల్ కార్పేరేషన్ లో రెగ్యులర్ ఉద్యోగులుగా జవాన్లుగా పని చేస్తున్న కుమార్, ప్రసాద్, లతీఫ్, రజాక్ లను సానిటరి ఇన్స్ పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు.

మొన్నటి వరకు ఐదు సర్కిళ్ళు ఉండగా పది సర్కిళ్ళు కావడంతో కొత్తగా ప్రమోషన్లు పొందిన జవాన్లతో పాటు ఔట్ సోర్సింగ్ వారికి కూడా వివిధ సర్కిళ్ళకు ఎస్సైలుగా నియమించారు. ప్రస్తుతం 3వ సర్కిల్ కు ఇంచార్జి ఎస్సైగా ఉన్న మహిపాల్ కు సర్కిల్ -1 ఏ (1,15,16,17,35,36 డివిజన్లు) కు బదిలీ చేశారు. 23వ డివిజన్ ఇంచార్జి ఎస్సైగా ఎన్.ప్రసాద్ సర్కిల్ -1 బిని కేటాయించగా (37,38,39,40,43డివిజన్), 22వ డివిజన్ ఎస్సైగా ఉన్న కుమార్ కు 2ఏ సర్కిల్ ను కేటాయించారు. ఈ సర్కిల్ పరిధిలో (4,5,6,7,22,24) డివిజన్లు ఉన్నాయి. 1వ సర్కిల్ కు సానిటరి ఇన్స్ పెక్టర్ గా ఉన్న ప్రశాంత్ 2బి సర్కిల్ ను కేటాయించారు. అందులో (23,25,26,45,46,47,48) డివిజన్లు ఉన్నాయి. సర్కిల్ 5 ఎస్సైగా ఉన్న శ్రీకాంత్ కు 3ఏ సర్కిల్ ను కేటాయించగా అందులో (8,9,27,28,50) డివిజన్లు ఉన్నాయి. 4ఏ సర్కిల్ ఎస్సైగా ఉన్న కృష్ణకు 3బి సర్కిల్ ను కేటాయించగా అందులో (49,51,52,56,57,58,59) డివిజన్లు ఉన్నాయి. డంపింగ్ యార్డు ఇంచార్జి ఎస్సైగా ఉన్న ప్రభుదాస్ కు 4ఏ సర్కిల్ ను కేటాయించగా అందులో 20,21,33,44 డివిజన్లున్నాయి. సర్కిల్ 2 ఎస్సైగా ఉన్న సునీల్ కుమార్ కు 4బి సర్కిల్ ను కేటాయించగా అందులో 2,3,18,19,41,42 డివిజన్లు ఉన్నాయి. 4బి సర్కిల్ ఎస్సైగా ఉన్న ఎం.డి.షాదుల్లా హుస్సెన్ కు 10,11,12,13,14,30,31 డివిజన్లను కేటాయించారు. డివిజన్ 14,31 ఇంచార్జి ఎస్సైగా ఉన్న అబ్దుల్ రజాక్ కు 5బి సర్కిల్ ను కేటాయించారు. ఈ సర్కిల్ లో 32,29,53,54,55,60 డివిజన్లున్నాయి. డివిజన్ నంబర్ 11 ఇంచార్జి ఎస్సైగా ఉన్న లతీఫ్ ను డంపింగ్ యార్డు ఇంచార్జి సానిటరి ఇన్స్ పెక్టర్ గా నియమించారు.

పరిపాలన సౌలభ్యం, చెత్త సేకరణ, పారిశుద్ద్య పనులను పర్యవేక్షించడానికి సర్కిళ్లను పెంచిన నిజామాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ను మాత్రం నియమించడంలో చొరవ చూపలేదు. కార్పొరేషన్ లో ఎంహెచ్ వోగా ఎంబీబీఎస్ వైద్యుడు ఉండాల్సిన చోట ఎస్సై క్యాడర్ గా ఉన్న ఉద్యోగితోనే కాలం వెల్లదీస్తున్నారు. ఎంహెచ్ వో గా వైద్యుడు లేకపోవడంతో పారిశుద్ద్యంతో పాటు పశువధ శాల, హోటళ్ళపై పర్యవేక్షణ కరువైంది. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత అయినా డాక్టర్ ను ఎంహెచ్ వోగా నియమిస్తారని ఆశపడ్డ వారికి నిరాశ తప్పడం లేదు. కార్పొరేషన్ కు ఐఏఎస్ లు కమిషనర్లుగా నియమితులైతున్న ఎంహెచ్ వోలు మాత్రం డాక్టర్లను నియమించకపోవడం దారుణం.

Creation of five new circles in the municipal corporation
 

More articles

Latest article