28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జనరణ్యంలో కరెంట్ కట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కరెంట్ ఎప్పుడు ఉంటుందో… ఎప్పుడు పోతుందో

 

. . . రోహిణి కార్తే కాలంలో సగటు జీవి వేడిమితో విల విల

 

. . . డిమాండ్ కు సరిపరా సప్లై ఉన్న కరెంట్ కోతలే

 

. . . ఉక్కపోతలకు తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరవాసులకు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుదవారం ఉదయం 10 గంటల వరకు కరేంట్ కష్టాలను చవి చూశారు. అది డి 4 పరిధిలోని వినాయక్ నగర్ కావచ్చు… డి 2 పరిధిలోని విక్లీ మార్కేట్ కావచ్చు కానీ కరెంటు సరాఫరాలో తరుచు అంతరాయం ఏర్పడింది. రాత్రి అకాల వర్షంకు తోడు గాలీ దుమారం తోడు కావడంతో  ఈ పరిస్థితి తలేత్తింది. నగరంలోని మిగితా తొమ్మిది సెక్షన్ ల పరిధిలోని గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఇటీవల వేసవికి ముందే ప్రి మన్ సూన్ చెకప్ ల పేరిట విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే చెట్లను నరికి కరేంట్ శాఖ వారు వానకాలం కు సిద్ధమయ్యారు. కానీ చెడగోట్టు వానల కారణంగా గాలీ దుమారంతో కరేంటు సరఫరాలో ఇబ్బందులతో సబ్ స్టేషన్ ల వద్ద విద్యుత్ ట్రిప్ అనే సమస్యలు తలేత్తాయి. నిజామాబాద్ నగరం దాదాపు 4.5 లక్షల జనాభా కలిగిన నగరం. చుట్టురా 17 కిలో మీటర్ల విస్థిర్ణం ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ . అలాంటి నగరంలో ఇటీవల వరుసగా విద్యుత్ కు కటా కటా తప్పడం లేదు. దాదాపు మూడు అసిస్టేంట్ డివిజన్ (ఎడిఇ) ల పరిదిలో తొమ్మిది సెక్షన్ల పరిధిలో 2 లక్షల విద్యుత్ కనేక్షన్ లు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా విద్యుత్ వినియోగదారులు, వినియోగం జరిగే ప్రాంతంలో కరెంట్ సరఫరాలో తరుచు ఆంతరాయం కష్టమర్లకు కోత్త కష్టాలను తెస్తే, విద్యుత్ శాఖ అధికారులకు పరుగులను పెట్టిస్తుంది…

 

Power cut in Janaranyam

 

నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత జిల్లా. జిల్లా మీదుగా గోదావరి, మంజీర నదులు ప్రవహిస్తున్న బోర్లపైన ఎక్కువ శాతం పంటలు పండిస్తారు. అంతేగాకుండా జిల్లాలో నిజామాబాద్ సిటీతో పాటు బోదన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాల్టీలతో  చాల పెద్ధ మండలాలు సెలక్షన్ గ్రేడ్ పంచాయతీలకు తీసిపోవు. నిజామాబాద్ జిల్లాలో సాధరణంగా విధ్యుత్ వినియోగం 5.6 మిలియన్ యూనిట్లు. కాని ప్రస్తుతం 6 మిలియన్ యూనిట్లు. డిమాండ్ ను మించి విధ్యుత్ వినియోగం జరుగుతున్న ఎక్కడ సరఫరా లోపం లేకుండా విధ్యుత్ సరఫరా జరగుతుంది. వరి పంటల కోతలు పూర్తయినప్పటికి విద్యుత్ డిమాండ్ ఎమాత్రం తగ్గలేదు. అందుకు కారణం ఎండలు. దాదాపు జిల్లాలో గత రికార్డులను ఈ సారి ఉష్ణోగ్రతలు బద్ధలు కోట్టాయి. దానితో అందరికి కరేంట్ అవసరం అన్నది ఖచ్చితంగా మారింది. సాధరణంగా ఫ్యాన్ తో పాటు కూలర్ లు అందరికి అందుబాటులో ఉండగా ఎసీలు కుడా వినియోగం పెరిగింది. డిమాండ్ కు సరిపడా కరేంట్ సరఫరా జరుగుతున్న సాంకేతికంగా చిన్న సమస్యలు, గాలీ , దుమారంతో వచ్చే అప్పటికప్పటి సమస్యలు కరేంటు కోతలను కల్పిస్తున్నాయి..

 

Power cut in Janaranyam

 

నిజామాబాద్ జిల్లా సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నెల 25న రోహిణి కార్తే వరకు గరిష్ట ఎండలు 45 డిగ్రీలు.. కనీష్టంగా రాత్రి వేళ సైతం 28 డిగ్రీల సెల్సియేస్ గా నమోదైంది. ఇక వడగాల్పులు వశపడనిస్తలేవు. పట్ట పగలు ఉక్కపోతలు సామాన్యుడు మొదలు అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగ భగలకు ప్రజలు ఉధయం 10 గంటల తరువాత రోడ్డేక్కేందుకు భయపడ్డారు. మిట్ట మధ్యహ్నం రోడ్లే నిర్మాణుష్యమయ్యాయి. ఇక వేసవి సేధ తీరేందుకు సగటు జీవికి  ఫ్యాన్ లేదా కూలర్ లు దిక్కు. ఇక వేడిమి నుంచి ఉపశమనంకు శీతల పానీయాలే గతి. ఇవ్వన్ని ఓకే వైపు కరేంటు ఒక్క క్షణం లేకపోయిన సగటు జీవి విల విల్లాడుతున్నారు. వేసవిలో ప్రధానంగా ఈ  సీజన్ లో కరేంటు లేకుంటే ఇళ్లు, వాకిలి, ఆఫీస్, వ్యవసాయం, వ్యాపారం ఎదానికైనా కరేంట్ ఉండాల్సిందే. కాని ఓక్క క్షణం కుడా కరేంట్ పోయిందాంటే ప్రజలకు నిధ్రహరాలు కరువవుతున్నాయి. పూటకు తిండి ఉన్న లేకున్న పరువాలేదు కాని విధ్యుత్ సరఫరా మాత్రం ఉండాల్సిందే. ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేధలకు 200 యూనిట్ల లోపు వారికి గృహ జ్యోతి పథకం కింద ఉచిత కరేంట్ మొదలుకోని వ్యవసాయానికి ఉచిత కరేంటు ప్రభుత్వం పై బారం పడటమే కాకుండావేసవిలో సాధరణ డిమాండ్ మించి సప్లై చేయాల్సిన పరిస్థితి నెలకోంది.. ఈ విషయంలో నిజామాబాద్ విధ్యుత్ శాఖ ఎస్ఇ రాజేశ్వర్ రావును వివరణ కోరగా కరేంటు కోతలకు స్థానికంగా అప్పటికప్పుడు ఎర్పడిన సమస్యలే కారణం అన్నారు. అందరికి 24 గంటలు కరేంటు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్ కు సరిపడా కరేంట్ సప్లూ అవుతుందన్నారు.

More articles

Latest article