23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

భారీ వర్షాలతో తెగిపోతున్న చెరువు కట్టలు

Must read

📰 Generate e-Paper Clip

  • భారీ వర్షాలతో ఇండ్లు నేలమట్టం
  •  చెరువులు కాదు వ్యవసాయ పంట పొలాలు
  • భారీగా పంట పొలాల నష్టం
  • ఆందోళనకరంగా చెరువు కట్టల పరిస్థితి
  • రాకపోకలను నిలిపివేస్తూ వాహనాలను అడ్డుపెట్టిన అధికారులు

ఇందల్వాయి,బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో  మండల కేంద్రంలోని సిర్నాపల్లి రామన్న చెరువు కట్ట, రామ్ సాగర్ తండా చెరువు కట్ట, తెగిపోయాయి, దీంతో ఇతర చెరువు కట్టల పరిస్థితి ఆందోళనకారంగా మారింది,అలాగే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నేలమట్టమవుతున్నాయి. వ్యవసాయ పంట పొలాలు సైతం చెరువుల తలపిస్తున్నాయి.భారీ వర్షాలు  నేపథ్యంలో వాగులు, వంకలు హోరెత్తుతూ  పరవాళ్ళు తొక్కుతున్నాయి,అక్కడక్కడ చెరువు కట్టలు తెగిపోయే  ప్రమాదం ఉంది. వాగులు ఉదృతంగా

Pond embankments breaking due to heavy rains

ప్రవహించడంతో రోడ్లపై నుండి వర్షపు నీరు వెళుతుండడంతో అధికార యంత్రం రాకపోకలను నిలిపివేశారు దీనికి ప్రయాణికులు అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.  రోడ్లపై పారుతున్న వర్షపు నీరు ఇళ్లలోకి రావడం జరుగుతుంది. దీంతో ప్రజలు  భయందోళకు గురవుతున్నారు.మరో రెండు రోజుల పాటు పరిస్థితి  ఆందోళనకరంగా నెలకొంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించారు. ప్రజలు అవసరాల మేరకు తప్ప రోడ్లపైకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.శిథిలావస్థలో ఉంటున్న ప్రజలు గ్రామ

Pond embankments breaking due to heavy rains

పంచాయతీ కార్యదర్శి కి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను ఆశ్రయించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని సూచించారు.అలాగే గణేష్ మండపాల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇదివరకే సిర్నపల్లి లో రామన్న చెరువులోకి  ఉదృతంగా నీరు రావడంతో చెరువు కట్ట తెగిపోయింది.ఇలాగే భారీ వర్షాలు పడితే చెరువు కట్టల పరిస్థితి  ఆందోళనకరంగా మారే అవకాశాలున్నాయి.

Pond embankments breaking due to heavy rains

More articles

Latest article