24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మిస్సింగ్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

  • భార్యే హంతకురాలు
  • ప్రియుడితో కలిసి భర్త హత్య
  • నాలుగు నెలలకు వెలుగులోకి హత్య

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డి పేట్ కు చెందిన షేక్ అహ్మద్ సాబ్ మిస్సింగ్ కేసు మర్డర్ గా పోలీసులు తేల్చారు. జనవరి 24న మిస్సింగ్ అయిన షేక్ అహ్మద్ సాబ్(47) కనబడుట లేదని అతని భార్యనే పోలీసులకు ఫిర్యాదు చేయగా నెలలు గడుస్తున్నా సమాచారం లేకపోవడంతో భార్యను విచారించడంతో మర్డర్ అయినట్లు గుర్తించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీంధర్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ జనవరి 24న షేక్ అహ్మద్ సాబ్ అనే వ్యక్తి కనిపించడం లేదని అతని భార్య సాలవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే తన భర్త కనిపించడం లేదని పోలీసులను తప్పుదారి పట్టించేయత్నం చేసింది. పోలీసులు సాంకేతికంగా సెల్ ఫోన్ డాటాతో పాటు లొకేషన్ ల ఆధారంగా సాలవ్వను అదుపులోకి తీసుకుని విచారించడంతో అహ్మద్ సాబ్ ను తన ప్రియుడు అయిన కుర్మసాయిలుతో కలిసి ఎల్లారెడ్డి అడవిగుట్టలో పూజ చేసేది ఉందని తీసుకెళ్లి మద్యం సేవించిన అనంతరం గొంతునులిమి హత్య చేశారు. తర్వాత పెట్రోలో పోసి కాల్చివేశారు. సాలవ్వకు కుర్మసాయిలుకు మధ్య ఉన్న వివాహేతర సంబంధానికే అహ్మద్ సాబ్ అడ్డుగా ఉన్నాడని అతన్ని హత్య చేసినట్లు సిఐ తెలిపారు. ఈ కేసును చేదించడంలో ఎల్లారెడ్డి ఎస్సై మహేష్, సిబ్బంది అనిల్, సిద్దూ, ప్రసాద్, ఇద్రీస్ లను కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారని సిఐ తెలిపారు. వారి వద్ద నుంచి ఎక్స్ ఎల్ బైక్ తో పాటు  వెండి కడియం స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు.

More articles

Latest article