23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

రూ. 7.25 కోట్ల విలువైన ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రతి నెల 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరి చేస్తున్న జిల్లా పోలీసులు

 

. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4531 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ.7.25 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. సెల్ ఫోన్ పోయినా లేదా చోరికి గురైన ఆందోళన అవసరం లేదని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందవచ్చని ఆయనన్నారు. అలాగే ప్రస్తుత కాలంలో ఫోన్ అనేది కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా అందులో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన డేటా కూడా ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తోందన్నారు. నేపథ్యంలో ఇన్ స్పెక్టర్ జె.నరేష్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి నెల సగటున 100 కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తోందన్నారు. గణాంకాలను వెల్లడిస్తూ గత ఏడాదిలోనే సుమారు 3 కోట్ల విలువైన 1834 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గత 30 రోజుల్లో రూ.20.32 లక్షల విలువైన 123 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వెంటనే సంబందిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు, సిమ్ కార్డును బ్లాక్ చేసి www.ceir.gov.in వెబ్ సైట్ లో ఫోన్ ఐఎంఈఐ నంబర్ ను బ్లాక్ చేయాలని కోరారు. మొబైల్ ఫోన్ ద్వారానే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తు తెలియని లింకులు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రికవరీ అయిన మొబైల్ ఫోన్లను పొందేందుకు బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎస్ఐ బాలరాజు (ఫోన్ : 8712686114) ని సంప్రదించి తమ మొబైల్ ఫోన్లను పొందవచ్చని తెలిపారు.

More articles

Latest article