బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలోని చౌరస్తా సమీపంలో గణపతి వెనకాల పేకాట ఆడుతున్న ఐదుగురుని వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు మంగళవారం తెలిపారు. చౌరస్తా సమీపంలోని గణపతి వెనకాల ఆడుతున్నారని విశ్వాసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పట్టుబడిన వారి నుంచి 5000 రూపాయల నగదు రెండు మోటార్ సైకిల్ 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట స్థావరాలు కొనసాగితే తమకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
