పోచారం ప్రాజెక్టు నీటి విడుదల ప్రణాళిక ఖరారు

0 7,126

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  యాసంగి 2025–26 కు పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రణాళిక ఖరారైంది. శనివారం
ఎల్లారెడ్డి డివిజన్ నాగిరెడ్డి పేట్ మండలంలోని పోచారం ప్రాజెక్ట్ యాసంగి 2025–26 సాగు కాలానికి సంబంధించి పోచారం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటి విడుదలపై ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రాజెక్టులో ప్రస్తుతం 1463.68 క్యూసెక్కుల నీటి నిల్వ ఉండగా, సాగునీటి అవసరాల కోసం 1.75 టీఎంసీ నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా బీ-జోన్ ఆయకట్టు రైతుల కోసం జనవరి 9, 2026 నుంచి నీటి విడుదల ప్రారంభం కానుంది.
నీటి విడుదల షెడ్యూల్
1వ విడత: 09-01-2026 నుంచి 23-01-2026 వరకు
విరామం: 24-01-2026 నుంచి 02-02-2026 వరకు
2వ విడత: 03-02-2026 నుంచి 17-02-2026 వరకు
విరామం: 18-02-2026 నుంచి 27-02-2026 వరకు
3వ విడత: 28-02-2026 నుంచి 13-03-2026 వరకు
విరామం: 14-03-2026 నుంచి 23-03-2026 వరకు
4వ విడత: 24-03-2026 నుంచి 07-04-2026 వరకు
విరామం: 08-04-2026 నుంచి 17-04-2026 వరకు
5వ విడత: 18-04-2026 నుంచి 27-04-2026 వరకు
రైతులకు సూచనలు
అధికారులు మాట్లాడుతూ, ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని, కాలువల వెంట అక్రమ వినియోగం జరగకుండా సహకరించాలని సూచించారు. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఆయకట్టుదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.