28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇసుక ట్రాక్టర్ బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

 కోటగిరి, బతుకమ్మ :  ఇసుక ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం కోడిచర్ల గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ శనివారం గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ధనార్జనే ధ్యేయంగా  కొందరు ఇసుక ట్రాక్టర్ యజమానులు అనుభవం, అర్హత లేని డ్రైవర్ల చేతికి వాహనాలు ఇవ్వడంతో ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ తో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లకు అర్హత ఉందా లేదని పరిశీలించి మైనర్లకు డ్రైవింగ్ ఇచ్చిన ట్రాక్టర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article