33.2 C
Hyderabad

 అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి

Must read

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, బతుకమ్మ :  కస్తూర్బా గాంధీ పాఠశాలలోని విద్యార్థిని  అనుమానాస్పదంగా  మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..  బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుర్రం తిరుపతి రెడ్డి, శ్రావణి, దంపతుల కుమార్తెలు వర్ష, హర్షినిలు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్నారు. వర్ష తొమ్మిదో తరగతి చదువుతుండగా, హర్షిని ఏడో తరగతి చదువుతోంది.  రోజులాగే రాత్రి భోజనం చేసిన అనంతరం తోటి స్టూడెంట్స్ తో కలిసి హాస్టల్లో ఆడుకున్న హర్షిణి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో తోటి స్టూడెంట్స్ టీచర్లకు తెలుప డంతో వారు హుటాహుటినా సురభి మెడికల్ కాలేజ్ కు తరలించగా, అక్కడ పరీక్షిం చిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.వెంటనే స్కూల్ టీచర్లు శనివారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పాప మృతదేహాన్ని శవ పరీక్ష కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు పంచనామా నిర్వహించారు.

 

 

 

More articles

Latest article