పోచారం ప్రాజెక్టు నీటి విడుదల ప్రణాళిక ఖరారు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : యాసంగి 2025–26 కు పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రణాళిక ఖరారైంది. శనివారం ఎల్లారెడ్డి డివిజన్ నాగిరెడ్డి పేట్ మండలంలోని పోచారం ప్రాజెక్ట్ యాసంగి 2025–26 సాగు కాలానికి సంబంధించి పోచారం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటి విడుదలపై ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టులో ప్రస్తుతం 1463.68 క్యూసెక్కుల నీటి నిల్వ ఉండగా, సాగునీటి అవసరాల కోసం 1.75 టీఎంసీ నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా బీ-జోన్ ఆయకట్టు...