28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పోచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా బుడిమి గ్రామంలో గురు మదనానంద సరస్వతి పీఠదీశ్వరులు మాధవనంద సరస్వతి స్వామి వారి సమక్షంలో హరి హర దేవి దేవతల ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా శుక్రవారం జలాధివాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మోస్రా మండల పరిధిలోని గోవూరు గ్రామం ప్రధాన రహదారిపై ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,

 

Pocharam launches several development programs in Banswada

గోవూర్ గ్రామంలో ఎస్ డీ ఎఫ్ నిధులు 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాల్ ను తన చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే వర్ని మండల పరిధిలోని తగిలేపల్లి గ్రామంలో హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి వారి సమక్షంలో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఎస్ డీ ఎఫ్ నిధులు 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆశ్రమ భవనమును ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Pocharam launches several development programs in Banswada

More articles

Latest article