26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కోనాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎల్లగోని కిష్టవ్వ శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా యువకులు గ్రామంలో ప్రధాన వీధులలో డీజే చప్పుళ్లతో, దేశభక్తి నినాదాలతో శోభాయాత్రను నిర్వహించారు. జెండాలతో మార్మోగిన వీధులు బ్యానర్లు కాషాయ జెండాలతో గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణన్ని సంతరించుకుంది. యువత శివాజీ జైకారాలతో ఊరంతా మార్మోగించారు. దేశభక్తి గీతాల మధ్య ర్యాలీ ఉత్సాహభారితంగా కొనసాగింది.

 

Chhatrapati Shivaji Maharaj Jayanti celebrated in Konapur

 

చరిత్రలో చిరస్థాయి నాయకుడు స్వరాష్ట్ర స్థాపన కోసం కృషిచేసిన శివాజీ మహారాజ్ పరిపాలన దక్షత, ధైర్య సాహసాలు, యుద్ధ వ్యూహాలు, భారత చరిత్రలో చిరస్థాయిలో నిలిచాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. శత్రువులపై అజేయస్ఫూర్తితో పోరాడి స్వరాజ్య స్థాపన చేసిన మహానేతగా ఆయనను కొనియాడారు. యువతకు స్ఫూర్తిదాయకంగా సందేశం మధ్య ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. సందేశం దేశభక్తి ఐక్యత భావాలతో ముందుకు సాగాలని శివాజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలని నాయకులు యువతకు పిలుపునిచ్చారు. సమాజ సేవలో ముందుండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దిల్ రాజ్ గౌడ్, ఉపసర్పంచ్ బంజ నాగభూషణం, మాజీ ఎంపిటిసి జెట్టి హనుమాన్లు, విడిసి చైర్మన్ జెట్టి మొగలాకర్ రావు, చాకలి సాయిబాబా, వసంత్ రావు, సాయిబాబా శ్రీనివాస్, బాల్రాజ్ గౌడ్, వేదిందర్, శంకర్, రవీందర్ గౌడ్, సురేష్, కాశీరాం, సంతోష్, రతన్, గణేష్, సాయినాథ్, సురేందర్రావు, భుజంగం, సాయిరాం, ప్రతాపరెడ్డి, విట్టల్, గ్రామ ప్రజలు, యువకులు, చిన్నారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Chhatrapati Shivaji Maharaj Jayanti celebrated in Konapur

More articles

Latest article