28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

13వ వార్డు అభివృద్ధి కోసం మరోసారి ఆశీర్వదించండి.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బాడీ శ్రీనివాస్.

 

బాన్సువాడ, బతుకమ్మ :  

 

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ గా వరుసగా రెండుసార్లు ప్రజలు నన్ను ఆశీర్వదించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత గడిచిన 10 సంవత్సరాలుగా కాలనీలో సీసీ రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి బాన్సువాడ పట్టణంలోనే మంచిగా అభివృద్ధి చెందిన కాలనీగా మార్చానని ఆయన తెలియజేశారు. కాలనీలోని మౌలిక వసతులు అలాగే కాలనీవాసుల వ్యక్తిగత సమస్యలు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, కుల, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా కాలనీవాసులకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశానని, కరోనా సమయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెడిసిన్ పంపిణీ కానీ నిత్యవసర సరుకుల పంపిణీ కానీ, అలాగే కాలనీవాసుల ఆరోగ్యం పై వారికి అవగాహన కల్పిస్తూ ఏ సమస్య వచ్చినా ఆ సమయంలో కానీ వాసులకు అందుబాటులో ఉండి సేవ చేశానన్నారు. మొదటిసారి కంటే రెండోసారి ఎంతో ఉత్సాహంగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని, ఇకముందు రానున్న రోజుల్లో కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని నిరంతరం కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను నా సమస్యకు భావించి పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మూడవసారి నన్ను ఆశీర్వదించాలని 13వ వార్డు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article