29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒకసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బిఆర్ఎస్ అభ్యర్థి చింతల్ శ్రీనివాస్ 

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ లోని తొమ్మిదవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి చింతల్ శ్రీనివాస్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు ఏలిన రాజ్యంలో, గాంధీ పుట్టిన దేశంలో జీవనం గడుపుతున్న మన ఓటు విలువను తెలుసుకొని నిజాయితీగా పనిచేసే, ప్రజాసేవ చేసే నాయకులని ఎన్నుకోవాలని  పేర్కొన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. నిరంతరం వార్డు సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎల్లప్పుడూ వార్డులో అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి సహకరిస్తానని సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article