. . . ఏర్గట్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూర్ణానందం
ఏర్గట్ల, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ లో తన ఇంటి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేయడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని ఏర్గట్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూర్ణానందం విమర్శించారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎరువుల కోసం రైతులు అనేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, గతంలో లాగే పాత పద్ధతిలోనే రైతులకు యూరియా పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతుల పక్షాన నిలిచే ప్రజా ప్రతినిధి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని అలాగే బిఆర్ఎస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేయడం సరైన విధానం కాదని, రైతులు చేస్తున్న ఆందోళనలను గౌరవించి ప్రభుత్వం తక్షణమే యూరియా యాప్‌ను రద్దు చేయాలని ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, సున్నపు అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం రమేష్, బద్దం ప్రభాకర్, కొలిప్యాక శ్రీనివాస్, తడపాకల్ అస్త్రప్, బట్టపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూతురు సాయన్న గన్నారపు రాజేశ్వర్, పాల్గొన్నారు.
