నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మూడు సంవత్సరాల నుంచి స్కాలర్ షిప్ లు రాకపోవడం వల్ల ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థులను సర్టిఫికెట్లు ఫీజులు కడితేనే ఇస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు పై చదువులు చదవడానికి అవసరమైన సర్టిఫికెట్లను ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తూ చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, శశాంక్, రంజిత్, మున్న, దినేష్, ప్రేమ్, రాజు, సన్నీ, వాసు, సునీత, శ్రావణి, హేమ, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

