- స్థానికుల ఆందోళన
- సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిసనర్ కు వినతి పత్రం
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 17, 18వ వార్డుల పరిసరాల్లో పశువదశాల నిర్వహణతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అక్కడి నుండి వెలువడుతున్న వ్యర్థాలు పక్కనే ఉన్న పంటపొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దుర్వాసనతో కూడిన కలుషిత వాతావరణం కారణంగా పంటలు దెబ్బతిని, కూలీలు కూడా పొలాల్లో పని చేయేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలపై రైతులు, కాలనీవాసులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.

వధశాల వద్ద పశువుల మృతదేహాలు నిల్వచేయడం వల్ల దుర్వాసన కారణంగా స్థానికులు విష జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పక్కనే ఉన్న ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సైతం ఈ దుర్వాసన తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. స్థానికులు ఉద్మిర్ సాయిలు, ఏం సురేష్, గణేష్, ఎల్. గణేష్, శంకర్, సాయిబాబా, నరేష్, సతీష్, గంగాధర్ ఈ సమస్యపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం లేకపోతే నిరసన ఆందోళనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.

