28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

 

తాడ్వాయి, బతుకమ్మ : తాడ్వాయి మండల పరిధిలోని 11 నుండి 14 గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్థులు విద్యుత్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ కొత్త విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో 2.11 కోట్ల రూపాయల నిధులతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు చిట్యాల గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మండల, గ్రామ యూత్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Permanent solution to problems with construction of power substation

More articles

Latest article