28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మర్డర్ కేసులో బెయిల్ కోసం అప్పు

Must read

📰 Generate e-Paper Clip

  • అప్పు ఎగ్గొట్టేందుకు రుణదాత మర్డర్
  • 48 గంటల్లోనే నర్సన్నపల్లి మర్డర్ కేసు చేదించిన పోలీసులు
  • పాత నేరస్తుడి అరెస్టు

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని నర్సన్నపల్లి గ్రామంలో గత నెల 30న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే చేదించారు. శుక్రవారం కామారెడ్డి  ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 30న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద చిదుర కవిత(44) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకు చీరతో ఉరి వేసి హత్య చేశాడు. ఈ నెల 1న ఆమె భర్త గంగారెడ్డి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సిఐ రామన్, దేవునిపల్లి ఎస్సై గూడెంరాజు ఆధ్వర్యంలో విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు.  సాంకేతిక సహాయంతో దోమకొండ మండలం చింతమాన్ పల్లికి చెందిన జంగంపల్లి మహేష్ అనే పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కవిత మర్డర్ కేసు కొలిక్కి వచ్చింది. జంగంపల్లి మహేష్ పై ఇది వరకు బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో ఒక మర్డర్ కేసు ఉంది. ఆ కేసులో బెయిల్ కొరకు చిదుర కవిత వద్ద మహేష్ రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. ఇటీవల కాలంలో అప్పు తిరిగి చెల్లించాలని కవిత ఒత్తిడి తేవడంతో ఆమె హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ నెల 30న కవిత వ్యవసాయ భూమి వద్దకు వస్తే డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికాడు. అక్కడికి వచ్చిన కవిత ముక్కుపై బలంగా చేతితో గుద్దడంతో ఆమె కింద పడిపోగానే చీరకొంగుతోనే ఉరి బిగించి ఊపిరి ఆడుకుండా హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, సెల్ ఫోన్ తీసుకుని పరారీ అయ్యాడు. మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని కేసును చాకచక్యంగా పరిష్కరించిన పోలీసు అధికారులను, క్రైం టీం సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

Loan for bail in murder case

More articles

Latest article