24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
  • లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సెచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య వర్ని  పోలీస్ స్టేషన్ పరిధిలోని జలల్పూర్ లో గల సైద్ పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్ లో గుండ్ల వాగు ను పొంగి పొర్లుతున్న సందర్బంగా లో లెవెల్ వంతెన పైనుంచి పొంగిపొర్లుతున్న వరద జలాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లో లెవెల్ వంతెన పైనుంచి పొంగిపొర్లుతున్న వరదజాలాలు ప్రవహించేటప్పుడు ప్రజలు ఎవరూ కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నించవద్దు అని తెలియజేశారు.

People should be alert

సమీపంలో లోతట్టు ప్రాంతంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల అధికారులను , గ్రామ అధికారులను అప్రమత్తం చేశారు. గ్రామాల్లోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా  గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. మండల ప్రజలు ఎవరు కూడా వాగులు కాలువలు చెరువుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లనీయవద్దని. ఎవరివైనా పాత ఇల్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి మండల అధికారులకు సమాచారం ఇవ్వవాలని   కోరారు.  రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  ప్రజలను కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని  లేదా డయల్ 100  లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్,  రుద్రూర్ సీఐ ఆర్ కృష్ణ ,  వర్ని ఎస్ఐ యు మహేష్, రుద్రూర్ ఎస్సై సాయన్న, వర్ని ఎంపీడీవో జి.వెంకటేష్ తదితరులు ఉన్నారు.

People should be alert

More articles

Latest article