- ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యచరణ సమితి
హైదరాబాద్, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల రిజర్వేషన్ ఫలాలను జిఓ 2 ద్వారా ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొంది. సెప్టెంబర్ 21న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మహా గర్జన నిర్వహిస్తున్నట్లు ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ (టిజి టిటిఎఫ్), రామచందర్ టీఈజీఏ ఎన్.యాదగిరి(బిటిఎఫ్), కొంగల వెంకట్, ఎస్పీ, ఎస్టీ యూఎస్ వి.సురేష్ (టీ ఈ జి ఏ) ఎస్.హరి కిషన్ (టిటిఏ), డాక్టర్ బాబూరావు (ఎస్సీ,ఎస్టీ డాక్టర్ అసోసియేషన్ ), తులసీదాస్ గైక్వాడ్ (ఎస్సీ, ఎస్టీ సెక్రెట్రియేట్ సంఘం) వాసం నాగేశ్వరరావు (ఎటిఎఫ్) డాక్టర్.నరసింహ, బబిత కుమారి (పీటీఏ) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పదోన్నతులలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఎడెక్వేసీ లెక్కింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి జనరల్ రోస్టర్ లో వెళ్లిపోయిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఖ్యను ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ కింద లెక్కించ కూడదన్నారు. కానీ రిజర్వేషన్ రోస్టర్ కింద లెక్కించి కళ్ళ ముందు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఫలాలను రెండు దశాబ్దాలు గా అందకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. జిఓ 2 ద్వారా జనరల్ రోస్టర్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులను రిజర్వేషన్ రోస్టర్ లో లెక్కించి రెండు దశబ్దాలుగా వందల మందికి పదోన్నతులు రాకుండా ప్రభుత్వాలు మోసం చేస్తు వస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల చట్టశుద్ధి ఉంటే జనరల్ రోస్టర్ ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులను ఎడెక్వేసీ కింద లెక్కించకూడదని,రిజర్వేషన్ రోస్టర్ లోనే ఎడక్వసీని చూసి ఎవరి వాటా వారికి ఇవ్వాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ పదోన్నతులలో కన్సిక్వాన్షియల్ సీనియారిటీ ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలకు ఆర్టికల్ 14,15,16 ఇంద్ర సహాని కేస్ తో ముడిపెట్టి ఏజెన్సీ గిరిజన హక్కులు లాక్కోవద్దని అన్నారు.ఏజెన్సీ చట్టాలకు లోబడి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్, అజ్మీరా వీరు నాయక్, రవీందర్, కృష్ణ మహారాజ్, ప్రేమకుమార్, రవీందర్, కేశపురం రమేష్ నాయక్, జాకబ్, విష్ణుమూర్తి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
