. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి
భీంగల్, బతుకమ్మ :
భీంగల్ పట్టణ శివారులో ఉన్న కెజీబీవిలో పెండింగ్ లో ఉన్న కట్టడం పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన పర్యటనలో భాగంగా భీంగల్ కేజీబీవి స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించారు. పట్టణ శివారులో ఉన్న స్కూల్ ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ విద్యార్ధినులు ఉండే స్కూల్ కాబట్టి వారి భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ ఎత్తును పెంచాలని ఆదేశించారు. అంతే కాకుండా స్కూల్ ఆవరణలోకి కుక్కలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. కేజీబీవిలో అందుతున్న వసతులు, సౌకర్యాలను గురించి స్టూడెంట్స్ ను ఆమె అడిగి తెలుసుకొన్నారు. విద్యార్ధినులకు కావాల్సిన సౌకర్యాలన్నింటిని యుద్ధప్రాతిపధికన పూర్తి చేయాలని సూచించారు.
