రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ దయాల లక్ష్మణ్ గ్రామానికి సరిపడా విద్యుత్ బల్బులను సొంత ఖర్చులతో గ్రామ సర్పంచ్ కొండల్వాడి శంకర్, గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన ఊరి కోసం తన వంతు సహాయ సహకారాలు అందించాలని సంకల్పంతో విద్యుత్ బల్బులను అందజేయడం జరిగిందని అన్నారు. బహుకరించిన విద్యుత్ బల్బులను గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు వీధి వీధి తిరుగుతూ కరెంట్ స్తంభాలకు అమర్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండల్వాడీ శంకర్, వర్డ్ సభ్యులు తోట అనిత భాస్కర్, తోట నర్సింలు, గాండ్ల ప్రవీణ్, గ్రామ పెద్దలు తోట సంగయ్య, నేరుగంటి బాలరాజు, తోట ప్రభాకర్, నడిపి సాయిలు, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్, తోట సుభాష్, సుదర్శన్ గౌడ్,గాండ్ల ఎర్ర సాయిలు, ఇల్టమ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
