పెద్దన్నకు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

0 14,642

మోర్తాడ్, బతుకమ్మ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మోర్తాడ్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి పెద్దన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ గా ప్రదోన్నతి కల్పిస్తూ  ఉత్తర్వులు జారీ చేయడంతో కళాశాల టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పెద్దన్నని ఘనంగా సన్మానించారు. కళాశాల అభివృద్ధికి పెద్దన్న అంకితభావంతో పని చేయడం జరిగిందని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. ప్రస్తుతం కళాశాలలో 545 మంది విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేశారు. అతి త్వరలోనే ప్రిన్సిపాల్ కృషి వలన కళాశాలకు పీజీ కోర్సులు, అటానమస్ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.