27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ నులి పురుగుల నిర్మూలనపై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన పై అంగన్వాడి టీచర్లకు ప్రాధమిక ఆరోగ్యకేంద్రము వైద్యాధికారిణి డాక్టర్ ఆయేషా సిద్దిఖా అవగాహన కల్పించారు.  1నుండి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నిర్మూలనకై అర్పండజోల్ మాత్రలను ఇవ్వడం జరుగుతుందన్నారు. 1నుండి 2 సంవత్సరాల పిల్లలకు అర్థ మాత, 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఒక్క మాత్ర నమిలి మింగేలా చూడాలన్నారు. పిల్లలు పాదరక్షలు లేకుండా ఆడటం, బహిరంగ మలవిసర్జన చేయడం, మురికి చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం కారణాల వల్ల నులి పురుగులు మానవ పేగుల్లో పరాన్న జీవులుగా జీవించి, వారికి పోషకాహారలోపం, రక్త హీనత, వాంతులు, విరోచనాలు, బలనత, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కలుగజేస్తాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత, మణి, ఆరోగ్య సూపర్ వైజర్ రవి, జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article