.. . ఆత్మ హత్యయత్నం ను అడ్డుకున్న పోలీస్, జెన్ కో సిబ్బంది
మెండోరా, బతుకమ్మ .
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఓ వ్యక్తి దూకి, చేయాలనుకున్న ఆత్మహత్యాయత్నం స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలిసులు, స్థానిక సిబ్బంది అడ్డుకుని కాపాడారు. శుక్రవారం సాయంత్రం మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదిలాబాద్ జిల్లా నేరేడు గోండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన అనూరుప్ శుక్రవారం ప్రాజెక్ట్ లో దూకేందుకు యత్నించారు. ప్రైవేట్ జాబ్ చేసే అనురూప్ కుటుంబంలో గొడవలు కారణంగా జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ ప్రాజెక్టు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు,జెన్ కో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. అనురూప్ ని కాపాడటంలో సహకరించిన జెన్ కో హోంగార్డు షూకూర్, నాగమణి, అక్బర్, పిబ్రి, దశరథ్, నిర్మల లను మెండోరా ఎస్సై సుహాసిని అభినందించారు.
