29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా పీసీసీ చీఫ్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమహిపాల్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండల కేంద్రంలో పురాతన శివాలయం నందికేశ్వర ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నందిపేట్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తాదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వారు మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి మాట్లాడుతారని, అటువంటి నాయకుడి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటునామన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల్ సీనియర్ నాయకులు పెంట ఇంద్రుడు, పిప్పర సాయారెడ్డి, నందిపేట్ మండల్ సర్పంచులు ఎర్రం లింగం, చిన్నయ్య, సుధన్, బ్యాగరి జీవన్, నక్క భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ బొంకం గంగారెడ్డి, దమ్మాయి శ్రీను, మోర్తాడ్ ముత్యం, ఓంకార్, దూడ వెంకటేష్, మజరొద్దీన్, హైమద్, రఫీక్, నసీర్, భాగ్యమ్మ, కాంతం చిన్నయ్య, లోక హన్మండ్లు, తిమ్ముల పోశెట్టి, నడ్కూడా భూమన్న, ఒడ్డే గంగాధర్, రాజశేఖర్, తమ్మల్లా దేవేందర్, ద్యావతి లింగం, మన్నె సాగర్, మేర శ్రీను, గాదె శ్రీను, గంగారెడ్డి, బల్గం దశరథ్, నాగ మల్లయ్య, వంజరి మల్లేష్, గొజ్జి కిసాన్, రఫీ, గౌతమ్, మేర కిరణ్, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

PCC Chief's birthday celebrated in grand style

More articles

Latest article