29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనపూర్ గ్రామంలో జిపిఎల్ టోర్నమెంట్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండలంలోని ఘనపూర్ గ్రామంలో ఆదివారం జిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ సాయినాథ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహణ కి ముఖ్య ఉద్దేశ్యం గ్రామంలోని యువకులందరూ ఐకమత్యంగా ఉండాలన్నారు. యువత సెల్ ఫోన్ కి దూరంగా ఉండి, ఆటలకు దగ్గర కావాలని తెలిపారు. ఈ ఆటల వల్ల శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారన్నారు. ఈ జిపిఎల్ టోర్నమెంట్ డా.దీపక్ రాథోడ్, ఆర్.కె.లక్ష్మీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. సర్పంచ్ రవి కిరణ్, కర్ణి గంగాధర్, అభిలాష్, మురళి మేస్త్రి, కె.నరేష్, కుమార్ తదితరులు ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ఆర్ఎస్ఐ సుమన్ అన్ని టీం ల ప్లేయర్ లకు క్యాప్ లు అందజేశారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న టీం లకు సాయినాథ్, గంగమోహన్, బి.కృష్ణ, దాస్ లు కెప్టెన్ లుగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

 

GPL tournament begins in Ghanpur village

More articles

Latest article