న్యాక్ సెంటర్ ను సందర్శించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ( న్యాక్ )ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. గురువారం న్యాక్ సెంటర్ లో అకాడమీ కార్యకలాపాలు పరిశీలించి శిక్షణా కార్యక్రమం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ....నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాక్ లో శిక్షణ పొందితే పాలిటెక్నిక్ డిప్లొమా సమానం అన్నారు. భవిష్యత్తు అంతా ఎఐ...