24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు

 మద్నూర్, బతుకమ్మ:

రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని , ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే  లక్ష్మికాంత్ రావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో బుదవారం రాత్రి మొక్కజొన్న పంటకు అగ్ని ప్రమాదం సంభవించి పంట కాలిపోయింది. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని బాధిత రైతుల పొలాలను పరిశీలించారు.

The government will always stand by farmers

 

ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశించారు. అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ, రైతులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు.

The government will always stand by farmers
The government will always stand by farmers

More articles

Latest article