28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

టైంకు వేతనాలు ఇవ్వండి కుయ్యో… మోర్రో

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమయానికి వేతనాలు రాక 108 (ఈఎంఆర్ఐ) సిబ్బంది వేతలు

 

. . . వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా ప్రయోజనం లేదని ఆవేదన

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఎవరికి, ఎలాంటి ఆపద వచ్చిన నిమిషాల వ్యవధిలో స్పందించి వారికి వైద్యంతో పాటు ప్రాణాలను కాపాడే 108 లో పని చేస్తున్న సిబ్బందికి సమయానికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రతి నెల ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియక 24 గంటలు సేవలు అందించే సిబ్బంది సమస్యల పాలవుతున్నారు. పేరుకు ప్రభుత్వం అనుబంధంగా పనిచేస్తున్నప్పటికి తాము దశాబ్ధాలుగా సేవలు అందిస్తున్న అరకొర వేతనాలు చెల్లిస్తుండగా అవి సమయానికి రాక ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కనీసం ప్రతినెల 5 లోపు వేతనాలు వస్తుండగా గత ఆరు నెలలుగా ఏనాడు తాము పనిచేసినందుకు జీతం కుడా సమయానికి చేతికి అందడం లేదని వాపోతున్నారు.

. . . వారి బాధలు వర్ణణాతీతం

ఉమ్మడి రాష్ట్రంలో పురుడు పోసుకున్న 108 అంబులేన్స్ సేవలు నిరాంతరాయంగా కొనసాగుతుంది. ఈ సంస్థ నిర్వహణను ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించేవారు. గతంలో జీవీకే సంస్ధ ఆ బాధ్యత నిర్వర్తించింది. ప్రస్తుతం ఈఎంఆర్ఐ హెల్త్ సర్విసేస్ పేరిట నిర్వహణ జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి అంబులెన్స్ కు ఇద్ధరు పైలెట్ లు (డ్రైవర్ లు), ఇద్దరు ఎమర్జెన్సీ మెనేజేమెంట్ టెక్నిషియన్ లు ( ఇఎంటి లు) సేవలందిస్తున్నారు. అందులో సీనియారిటీ ఆధారంగా పైలేట్ లకు రూ.28 వేల వేతనం, ఈఏంటిలకు రూ.30 వేల వేతనం దక్కుతుంది. రాష్ట్రంలో దాదాపు ఈ ఆపరేషన్ లో 7 వేల మంది పని చేస్తున్నారు. దాదాపు 5 వేల అంబులెన్స్ లున్నాయి. అవి నిరంతరంగా గ్రామం మొదలుకోని పట్టణాలలో, నగరాలలో పనిచేస్తు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి.

 

Pay wages on time, Kuyyo... Morro

 

గత ఆరు నెలలుగా 108 అంబులెన్స్ సిబ్బందికి జీతాలు సమయానికి చెల్లించకపోవడం వల్ల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా జీతాలు ఆలస్యంగా రావడం వల్ల కుటుంబ నిర్వహణ, పిల్లల చదువులు, ఇతర ఆర్థిక బాధ్యతలను నిర్వహించడం కష్టంగా మారింది. ప్రజలకు అత్యవసర సేవలు అందించే 108 సిబ్బంది రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించే ఈ సిబ్బందికి జీతాలు సమయానికి ఇవ్వడం అత్యంత అవసరం. కాబట్టి సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇకపై  ఈఎంఆర్ఐ అంబులెన్స్ సిబ్బందికి జీతాలను ప్రతి నెల సమయానికి చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మా వినమ్ర విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి పదుల సార్లుగా విన్నవించినా పలితం లేకుండా పోయిందని వారు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు..

More articles

Latest article