రోడ్డు కాదు పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్

0 1,073
  •  ఎమ్మెల్సీ కవితకు, రామ్ కిషన్ రావుకు ఎటువంటి సంబంధం లేదు
  •  ఆర్ కె ఆర్ అపార్ట్మెంట్ సభ్యులు అనవసరంగా రాద్ధాంతం
  • స్థల యజమాని నగేష్ కుమార్

నిజామాబాద్ సిటీ, బతకమ్మ : జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ఆర్కేఆర్ అపార్ట్మెంట్ రోడ్డు వివాదం సంబంధించి స్థలం రిజిస్ట్రేషన్ ప్లాట్ అని జన్నపల్లికి చెందిన స్థల యజమాని కొండూరు నగేష్ కుమార్(మైనంపల్లి హనుమంత రావు బావమరిది) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్ కె ఆర్ అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, తన సొంత ఫ్లాట్లో వాళ్లు రహదారిగా చిత్రీకరిస్తూ అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని అన్నారు. వివాదం చేస్తున్న దారిలో అది తన సొంత ఫ్లాట్ అని 219 సర్వేనెంబర్ లో ఉన్న 20035 గజాల ప్లాటు తాను 2018 లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అపార్ట్మెంట్ వాసులకు ఎటువంటి సంబంధం లేదని,అనవసరంగా తన స్థలం కబ్జా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు . కొందరు వ్యక్తులు కావాలని దుర్దేశంతో రాజకీయ రంగు పులుమాలని చూస్తున్నారని దానిలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత, రామ్ కిషన్ రావుల గురించి ప్రస్తావిస్తున్నారని వారికి ఈ స్థలంతో వివాదంతో, ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తన వద్ద స్థలానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయని, మున్సిపల్ కార్పొరేషన్ లో టాక్స్ సైతం చెల్లిస్తున్నానని, ఎవరు ఎప్పుడు అడిగినా అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.