- ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
- వైద్యుల రుణం తీర్చుకోలేనిది
నిజామాబాద్, బతుకమ్మ : గత కొన్ని రోజులుగా ఇంట్లోనే అనేక రోగులతో వ్యాధులతో బాధపడుతున్న రోగి కి సకాలంలో ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు రోగికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. ప్రెస్టేజ్ ఆసుపత్రిలో ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమ రాజ్, నెఫ్రాలజీ వైద్యులు మోసిన్ లు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీరంలోని ప్రధానమైన అవయవాలతో బాధపడుతున్న ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన నవీన్ (35) పూర్తిగా నిస్పృహ కోల్పోయి గులియం బ్యారీ సిండ్రమ్స్ తో శరీరంలోని ప్రధానమైన అవయవాలైన కిడ్నీ, లివరు, ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ వంటి శారీరిక యంత్రాలు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్టేజ్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి బరువు బాధ్యతలు నిర్వర్తించే ఇంటి పెద్ద మనిషి ఒకేసారి చావు బతుకుల వైపు పరుగులు తీస్తుండగా, చివరి నిమిషంలో కుటుంబ సభ్యులు ప్రెస్టేజ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు రోగి చికిత్స పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వైద్య పరంగా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యం అందించారు. ముఖ్యంగా శరీరంలోని గుండె కొట్టుకునే శాతం సాదారన రోగి కన్నా అతి తక్కువగా గుండె కోట్టుకోవడం, ఊపిరితిత్తులు చెడిపోవడం, రెండు కిడ్నీలు ఒకేసారి ఫేల్ కావడం, తో పాటు నరాల బలహీనత వంటి సమస్య తలెత్తి రోగి శరీరంలోని వైద్యానికి సహకారం అందించె కన్నా అతి తక్కువగా ఇలా ఉండడం ప్రపంచంలో చాలా అరుదుగా ఇలాంటి కేసులు లక్షల్లో ఒక్కటి కూడా కనిపించదని వైద్యులు సూచించారు. ఈ రోగికి గుండె సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగిన మాత్రలో వైద్యం అందిస్తూనే ఊపిరితిత్తులకు శున్యంగా పరిశీలించి ఎక్కడ కూడా రోగికి కావాల్సిన వైద్య సేవలు అందించడం జరిగింది అన్నారు. అంతేకాకుండా శరీరంలోని రెండు కిడ్నీలు కూడా చెడిపోయి మూత్రనాళ సమస్య తీవ్ర స్థాయిలో చేరడంతో రెండు కిడ్నీలు చెడిపోవడం జరిగిందని, రెండు కిడ్నీలోని రక్తాలను తొలగించి ప్లాస్మా రూపంలో కొత్తగా రక్తమార్పిడి చేసి రోగికి ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా జాగ్రత్తగా తీసుకోవడం జరిగిందని వారన్నారు. అంతేకాకుండా శరీరంలోని రక్తనాళాలు అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడం వల్ల పూర్తిగా బెడ్డు కు పరిమితం అవసరం పరిస్థితి ఉండేదని అలాంటి రోగికి ఆసుపత్రి వైద్య సిబ్బంది ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల నవీన్ అనే రోగికి ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్య పరంగా పునర్జన్మం ప్రసాదించినట్లు ఆస్పత్రి వైద్యులు భావిస్తున్నారు. దీంతో నవీన్ అనేక సమస్యలతో బాధపడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఉన్న పరిస్థితుల్లో ప్రెస్టేజ్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మం ప్రసాదించినందుకు వైద్యుల రుణం తీర్చుకోలేనిదని కుటుంబ సభ్యులు వైద్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

