ప్రముఖ కవి, విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థిలో పద్యం పట్ల మక్కువ పెంపొందేలా బోధించడంలో అధ్యాపకులు తమదైన శైలిలో చెప్పాలని ప్రముఖ కవి, విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం, భారతీయ భాష సంరక్షక కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం పునఃశ్చరణ మూడవరోజు తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు మాట్లాడారు. పద్యాన్ని కనీసం మూడుసార్లు చదవాలని సరైన క్రమంలో భావాన్ని చెప్పాలని అన్నారు. తద్వారా విద్యార్థులు పద్యం రాయాలని ఆసక్తిని పెంపొందించాలని అధ్యాపకులకు బోధించారు. అధ్యాపకులు విరివిగా పద్యాలను చదవాలని వాటిని సులభతరం చేసి చెప్పాలని అన్నారు. ప్రముఖ అనువాదకులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద్ మాట్లాడుతూ అనువాదం అనేది నేడు బహుళ ప్రయోజనాన్ని కలిగి ఉందని సామాజిక మాధ్యమాలలో అనువాదం ప్రముఖ పాత్రను పోషిస్తుందని తెలియజేశారు. తెలుగులో ఉన్న గొప్ప రచనలను ఇతర భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆచార్య కే లావణ్య, డాక్టర్ లక్షణ చక్రవర్తి పాల్గొన్నారు.
