విద్యార్థుల్లో పద్యం పట్ల మక్కువ పెంపొందించాలి
ప్రముఖ కవి, విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థిలో పద్యం పట్ల మక్కువ పెంపొందేలా బోధించడంలో అధ్యాపకులు తమదైన శైలిలో చెప్పాలని ప్రముఖ కవి, విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం, భారతీయ భాష సంరక్షక కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం పునఃశ్చరణ మూడవరోజు తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు మాట్లాడారు. పద్యాన్ని కనీసం మూడుసార్లు చదవాలని సరైన క్రమంలో భావాన్ని చెప్పాలని అన్నారు. తద్వారా విద్యార్థులు పద్యం రాయాలని...