27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపాల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్, బతుకమ్మ : 

 

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగోనేలాకాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. గురువారం గాంధీభవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకోవాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు రామకృష్ణ , మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ నూడా చైర్మన్, కేశ వేణు సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

 

More articles

Latest article