28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

ఇందూర్, బతుకమ్మ : వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షాతన  నగరంలో సందీప్ గార్డెన్ లో  ఇందూర్ అర్బన్ నియోజకవర్గ కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, బాణాల లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్టాచివరి పేదోనికి చేరాలన్న శ్యామ ప్రకాష్ ముఖర్జీ, దీన్ దయాల్, వంటి మహనీయుల ఆశయాలకు, ఆకాంక్షాలకు అనుగుణంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పార్టీ మోదీ నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ గత కుటుంబ పాలన మొత్తం అవినీతి లక్షల కోట్ల కుంబకోణలతో గడిసిందన్నారు. బిజెపి 11 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి కుంభకోణం లేకుండా దేశానికి సూపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశ్యావ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధన్యం అందిస్తూ తెలంగాణాలో ఇచ్చే సన్న బియ్యంలో అధిక వాటా కేంద్రానిదే అయితే కాంగ్రెస్ మేము ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. అవస్ యోజన కింద కేంద్రం ప్రతి పేదోని సొంతింటి కల సకారానికి ఆర్ధిక సహాయం అందిస్తుంటే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు అంటు మోసానికి తెర లేపుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళాలకు పెద్ద పిఠా వేసిందన్నారు.

BJP works towards a developed India

 

ఉజ్వలా యోజన ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్, స్వచ్ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత మంచినీటి సరఫరా, రాజకీయంగా మహిళలు రాణించాలని మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకురావడం చారిత్రత్మక విజయం అన్నారు. 11సంవత్సరాలలో 54,917 కిలోమీటర్లు జాతీయ రహదారుల నెట్వర్క్ ను జోడించడం జరిగిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 400 వందే భారత్ ట్రైన్లు తయారీ చేయడం జరుగుతుందని ప్రస్తుతం 136 ట్రైన్లు సేవాలందిస్తున్నాయన్నారు. 6,862 విద్యుత్ బస్సులు పర్యావరణ పరిరక్షణగా ప్రజలకు సేవాలందిస్తున్నాయన్నారు. 23 నాగరాలలో మెట్రో సేవలతో పాటు అమృత్ -2.0 కింద 6,933 పట్టణభివృద్ది ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగిందన్నారు. దేశ భద్రతలో భాగంగా బిజెపి అధికారంలో వచ్చిన తరువాత 370 ఆర్టికల్ రద్దు, ఆపరేషన్ సిందూర్,   ఆపరేషన్ కావేరి ద్వారా కల్లోలిత సూడన్ నుండి 3 వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడం,23 వేల మంది భారతీయులను ఉక్రెయిన్  నుండి స్వదేశానికి తరలించడం జరిగిందన్నారు. పదకొండేళ్ల బిజెపి పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, సాధించిన విప్లవత్మక విజలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

BJP works towards a developed India

More articles

Latest article