29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Must read

📰 Generate e-Paper Clip

Panchayat Secretary caught by ACB

మాక్లూర్, బతుకమ్మ : ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులు విషయంలో లంచం తీసుకుంటూ బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామపంచాయతీ కార్యదర్శి కటకం మోహన్ రూ. 18000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ముప్పిడి రాజేంధర్ తన స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి కోసం గ్రామ పంచాయతీకి వెళ్లాడు. గ్రామ పంచాయతి కార్యదర్శి కటకం మోహన్ ఇళ్లు నిర్మాణ అనుమతికి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి కటకం  మోహన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Panchayat Secretary caught by ACB

More articles

Latest article