26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరా క్రాంతి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరా క్రాంతి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని డీఆర్డీఓ డి.సాయన్నఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం జిల్లా సమాఖ్యా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  అన్ని మండలాలలో ఇందిర మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ కౌంటర్లు,  దేశి కోళ్ల మధర్ యూనిట్ లు, ఇతర ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు లబ్ధిదారులను గుర్తించి జాబితా జిల్లా కార్యాలయం నకు పంపాలని తెలిపారు. సెర్ప్ ద్వారా జిల్లాలో ఎడపల్లి మండలం జానకంపేట్ లో 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని, అదేవిధంగా జిల్లాలో మండల సమాఖ్య, గ్రామ సమాఖ్యలు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశం లో డిపీఎంలు సంధ్యారాణి, నీలిమ, సాయిలు, మారుతి, శ్రీనివాస్, శ్రీనిధి ఆర్ఎం రాందాస్, ఏపీఎం ఐబి సరోజిని, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ, కార్యదర్శి లావణ్య, 28 మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.

A list of beneficiaries of Indira Kranti should be prepared

More articles

Latest article