బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి మాట్లాడుతూ గతంలో పసుపు రైతులు పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేశారని తెలిపారు. ఏ నాయకుడు పసుపు బోర్డు కొరకు ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్ 2019లో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి పసుపు బోర్డు నిజామాబాద్ కు తీసుకురావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే పసుపు బోర్డ్ కాకుండా, పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పరచడం పట్ల జిల్లా రైతుల పక్షాన ప్రధాని మోడీకి ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మిర్యాల,మాజీ ఎంపీటీసీ బిజెపి పార్టీ నాయకుడు శంకర్, మాజీ సర్పంచ్ సోమ రాజారెడ్డి,ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు సోమ బంగ్లా రాజారెడ్డి, జామ శంకర్, ఆనందం గంగేష్, మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం సురేష్, ప్రశాంత్, పవన్, ఘన శ్యామ్,జీవన్, ప్రసాద్, రమేష్, మహిపాల్, నేరెళ్ల రోహిత్, గుండ విటల్,కూరాకుల శీను, బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
